Sunday, April 13, 2014

Scared about future?? What we can do??

మన జీవితంలో మనం చాలా  విషయాల్లో సర్దుకొని వెళ్తూ ఉన్నాం , ఎందుకంటే తప్పట్లేదు .. ఇలా ఎందుకు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఏంట్రా ఈ జీవతం అనిపిస్తుంది , అసలు ఇదొక బ్రతుకా అనిపిస్తుంది .. ఇపుడు చూస్తున్న మరో దారుణం ఏంటి అంటే తాగే నీటిని కూడా ఇపుడు కొనాల్సి వస్తుంది .. చివరికి పీల్చుకొనే  గాలిని కూడా కొనే రోజు ఎంతో దూరం లేదు అనిపిస్తుంది .. మనకు సులువుగా , ఉచితంగా దొరికే వాటిని కూడా కొనాల్సి వస్తే ఒక పేదవాడి భవిష్యతు ఏంటి .. మన భావితరాల పరిస్థితి ఏంటి ... ఇలాంటి దుస్థితికి కారణం ఏంటి .. ఒక్కసారి వీటన్నింటిని మనం ప్రశ్నించుకుంటే
సమాధానం దొరకదా .. దొరుకుతుంది 

చాలా మందికి దొరికే సమాధానం ఏంటి అంటే..  
ప్రభుత్వాలు సరిగా లేవు .. దుర్మార్గులు రాజకీయాలు చేస్తున్నారు అంటారు 
రాజకీయం ఒక రొచ్చు  అంటారు.. వదిలేస్తారు 
అన్నీ తెలిసి కూడా దుర్మార్గులకే మళ్ళీ పదవులకు కట్టబెడతారు 
మనం రాజకీయం అనే బుడద లోకి దిగమ్.. పోనీ రాజకీయ దుర్మార్గులను పదవుల్లేకి రాకుండా చేస్తున్నామా అంటే లేదు 
ఎందుకంటే రాజకీయాల్లో అందరు దుర్మార్గులే .. 
వోటు కోసం నోటు ఇస్తారు .. అందరి దగ్గర తీస్కుందాం .. ఎవరికో ఒకరికి వోటు వేద్దాం అని కొంతమంది 
వాడిది మన కులం .. మన మతం .. వోటేద్దాం అని కొంత మంది 
బయటి ప్రపంచం ఎలా ఉందొ తెలిసి కుడా ..  ఎంతో చదువుకొని కూడా .. కనీసం జ్ఞానం లేకుండా నోటుకోసం , కులం కోసం .. వోటును వాడుకుంటే , నోటు ఇచ్చిన వాడు దోచుకోవడం తప్పంటారా .. 

మనం మారితే కదా .. రాజకీయ నాయకులు మారేది .. రాజకీయం మారేది 
ఇక్కడ మేము ఏ పార్టీ కి మద్దతు ఇవ్వడం లేదు 
ఇప్పుడైనా మేల్కుందాం అనే పిలుపునివాలనుకున్నాం 
.వాల్లకేం దోచుకుంటారు .. దోచుకుంటూనే ఉంటారు .. దీనివల్ల కష్టం , నష్టం మనకే కదా 
ఇప్పుడైనా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం .. మనలో మనలని వేరు చేసే కులాలు మతాలు మనకెందుకు .. 
భారతీయులుగా ఉందాం .. భావితరాల బంగారు భవిస్యత్తుకి నాంది పలుకుదాం ..

No comments:

Post a Comment